తాను వయసు పరంగా వృద్దురాలినే కానీ మనసు పరంగా ఇంకా యువతినేనని నటి షావుకారు జానకి అంటున్నారు. దాదాపు 15 ఏళ్ల అనంతరం తమిళంలో ఆమె 'వానవరాయన్ వల్లవరాయన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. తెలుగు తమిళం కన్నడం మళయాళం హిందీ భాషలలో 385 చిత్రాలలో నటించానన్నారు. ప్రస్తుతం తనకు 81 ఏళ్లుకాగా సినీరంగంలో ప్రవేశించి 62 ఏళ్లు అయ్యాయన్నారు. తొలిసారిగా పరిచయం అయింది తమిళంలోనేనని సినీరంగ జీవితంలో ఎందరో కళాకారులను చూశానని వారిలో కొందరినీ ఇప్పటి మరువలేని విషయమని అన్నారు. రజినీకాంత్‌కు వున్న పాపులారిటీ కమల్‌హాసన్ నటనా ప్రతిభ విస్మయం కలిగిస్తుందన్నారు. బాలనటుడిగా వున్న కమల్‌హాసన్‌తో కలసి 'పార్తాల్ పసితీరుం' అనే చిత్రంలో నటించానని మళ్లీ ఆయన దర్శకత్వంలోనే 'హేరామ్' చిత్రంలో నటించాలని కోరినపుడు ఆనందం వేసిందన్నారు. అయితే తనకు గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సి రావడంతో పూర్తిగా నటించలేకపోయానని అయినప్పటికీ..మొత్తం పారితోషకాన్ని కమల్‌హాసన్ అందించారని ఆ డబ్బే తన ఆపరేషన్‌కు ఉపయోగపడిందని పేర్కొన్నారు. తన చివరి చిత్రం అజిత్ దేవయాని జంటగా నటించిన 'తొడరుమ్' అనే తమిళ చిత్రమని నటనకు తాను దూరం కాలేదని అవకాశాలు రాకనే స్వస్థి పలికానని పేర్కొన్నారు. ఇటీవల దర్శకుడు రాజమోహన్ కలసి తన చిత్రంలో నటించాలని కోరారన్నారు. 81 ఏళ్ల వయసులో ఎలా వున్నానో అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అంగీకరించానని సుధీర్ఘవిరామం తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించానని ఆమె పేర్కొన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:shavukaru, Janaki, Political, Entertainment, Telugu
|