కాంగ్రెస్‌లో పిఆర్పీ విలీనం అనంతరం ఉపఎన్నికల ముందు వరకు చిరంజీవిని కీర్తించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఆయనను పిలవడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును ప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌ను పిసిసి బొత్స సత్యనారాయణను ఆహ్వానించిన కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవిని పిలవలేదు. మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి కూడా చిరంజీవిని ఆహ్వానించలేదు. ఉపఎన్నికల్లో చిరంజీవి చరిష్మా పనిచేయలేదని అందువల్లే ఆయనను అధిష్టానం పక్కనబెట్టిందని కొందరు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు ఎవరిని ఆకాశానికెత్తుతారో పాతాళానికి తోసేస్తారో తెలియదని ఆ రకంగానే చిరంజీవి పరిస్థితి ఉందని అంటున్నారు. కాంగ్రెస్‌పార్టీలో పిఆర్పీ విలీనం సమయంలో సోనియాగాంధీ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు కూడా దక్కని గౌరవం చిరంజీవికి దక్కింది. అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా సోనియాగాంధీని చిరంజీవి కలిసిన సందర్భాలున్నాయని కాంగ్రెస్‌నేతలు గుర్తు చేస్తున్నారు. ఉపఎన్నికల కంటే ముందు కూడా చిరంజీవిని భవిష్యత్తు నేతగా కాంగ్రెస్ ఊహించింది. కానీ ఎన్నికల ఫలితాల తారుమారుతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఫలితాల అనంతరం చిరంజీవికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొంతమంది నేతలు ప్రచారం మొదలుపెట్టారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiru, position, Political, Entertainment, Telugu
|