వెంకటేష్-మహేష్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. మల్టీస్టారర్‌గా అనేక సంచలనాలకు వేదికవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్‌తో ముందుకొస్తున్నారంటూ గాసిప్స్ విన్పిస్తున్నాయి.
వెంకటేష్ సరసన అంజలి మహేష్ సరసన సమంత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం విదితమే. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 'దిల్‌రాజు' నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అహోబిలంలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా లంచ్ బ్రేక్‌లో సినిమా కోసం వేసిన భారీ సెట్ కూలి చిన్నపాటి ప్రమాదం సంభవించింది. లంచ్ బ్రేక్ కావడంతో ప్రధాన తారాగణమెవరూ సెట్‌లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
అయితే షూటింగ్ సిబ్బంది ఇతర నటీనటులు ఆ సెట్‌లో వుండటంతో వారికి చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితుల్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్‌లోకి చిన్నా చితకా ప్రమాదాలు ఈమధ్య సర్వ సాధారణమైపోయాయి
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ssvkc, shooting, accident, Political, Entertainment, Telugu
|