నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమన్నారాయణ' విడుదలకు ముందే సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతోంది. ఈ చిత్రం షూటింగ్ పార్టు కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా బాలయ్య సినిమాలను తీసుకుంటే ఇంత ఫాస్ట్‌గా ఏ చిత్రం కూడా షూటింగ్ పార్టు పూర్తి చేసుకోలేదు.సాధారణంగా టాప్ హీరోల సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి 6 నుంచి 12 నెలల సమయం తీసుకుంటుంది. ఇంత త్వరగా సినిమా పూర్తి కావడంపై నిర్మాత రమేష్ పుప్పాల సంతోషం వ్యక్తం చేస్తూ బాలయ్య ప్రొఫెషనలిజంపై పొగడ్తల వర్షం కురిపించారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:srimannarayana, record, Political, Entertainment, Telugu
|