నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న 3డి సినిమా ఓం విడుదలకు సిద్ధమవుతుంది.కళ్యాణ్ రామ్ సరసన కృతిఖర్భంద మరియు నికిషా పటేల్ నటిస్తున్నారు.ఓం సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు.కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో సరికొత్తలుక్ తో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ గా అనుభవం వున్న సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారుతున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని సినిమాని ఆగష్టు లో రేలీఅసే చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Kalyan, ram, om, vidudala, eppudu, Political, Entertainment, Telugu
|