మిగతా దర్శకుల గురించి బూతుల విషయంలో విమర్శించలేను. ఎవరి స్టయల్ వారిది. నా వరకూ నేను కొన్ని నియమ నిబంధనలు విధించుకున్నానని రాజమౌళి అన్నాడు. నిజమే రాజమౌళి సినిమాలంటే ఎగబడి చూసేలా 'ఈగ' సినిమా రిలీజ్‌కి ముందే చిన్నపిల్లల్ని ఎట్రాక్ట్ చేసేసింది. 'మర్యాదరామన్న' సినిమాని చిన్నపిల్లలు ఎక్కువగా చూశారు. ఆ సినిమాకి పెద్దవాళ్లకాన్నా చిన్నపిల్లల్లోనే అభిమానులెక్కువ.'యమదొంగ'కి ముందు సినిమాలతో పోల్చితే 'యమదొంగ' సినిమాలో బూతులు తక్కువ...'మగధీర' సినిమాకొచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. 'మర్యాదరామన్న' క్లీన్ సినిమా. 'ఈగ' అంతకన్నా క్లీన్ సినిమా. ఇదీ రాజమౌళి తన సినిమాల్లో అశ్లీల ద్వందార్థాలతో కూడిన డైలాగు గురించి తప్పు ఒప్పేసుకుంటూనే తనలో మార్పు గురించి చెబుతున్న సంగతి.'ఈగ' తర్వాత రాజమౌళి చేసేది మాస్ సినిమా అయినా ఆ సినిమాలో బూతులుండవని రాజమౌళి చెప్పిన దరిమిలా రాజమౌళి సినిమాలకిక ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడం ఖాయం
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:rajamouli, speaks, about, his, movies, Political, Entertainment, Telugu
|