లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ” రెబల్ ” చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది మరియు ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించి ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జె. భగవాన్ మరియు జె. పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మరియు ఈ సన్నివేశాలు కొద్ది రోజుల్లో పూర్తవుతాయి.ప్రభాస్ సరసన తమన్నా మరియు దీక్షా సేథ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.లారెన్స్ ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నాడు. ప్రభాస్ డార్లింగ్ M .R . పెర్ఫెక్ట్ సినిమాల తరువాత ఈ సినిమా రానుండడం తో రెబెల్ స్టార్ అభిమానులు హేట్ట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Paata, minaha, poortaiena, rebel, Political, Entertainment, Telugu
|