రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ అన్సారీలకే తమ పార్టీ మద్దతు ఇవ్వనున్నట్లు వైసీపీ ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీ రాజకీయాలు పార్టీలకు అతీతంగా వ్యవహరించగలరని భావిస్తున్నందునే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ఇందులో కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందమేమీ లేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ నేత మైసూరారెడ్డి తదితరులతో కలిసి మేకపాటి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనారిటీ అభ్యర్థి అయిన హమీద్ అన్సారీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
జగన్‌కు బెయిల్ వస్తుందంటూ తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి చెప్పిన విషయం యాదృచ్ఛికమేనని స్పష్టం చేశారు. జగన్‌కు బెయిల్ ఇప్పించుకోవడానికే ప్రణబ్‌కు ఓటు వేయాలని నిర్ణయించామనడం సరికాదని న్యాయ వ్యవస్థనే ప్రభావితం చేయడం సాధ్యం కాదని మైసూరారెడ్డి చెప్పారు. న్యాయవ్యవస్థ దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేర్వేరు అన్నారు. వై.ఎస్.విజయలక్ష్మి పేరిట విడుదల చేసిన ప్రకటనను విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. "19వ తేదీన జరగనున్న దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలో ఓటు వేయాలా వద్దా అనేది మా పార్టీ ముందున్న ప్రత్యామ్నాయం.
ఇలాంటి పరిస్థితుల్లో దాటవేసే ధోరణిని అవలంబించి ఏ నిర్ణయమూ తీసుకోలేని పార్టీగా మిగిలిపోవడం ముద్ర వేసుకోవడం మా పార్టీకి సరైంది కాదు. అందుకే ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించాం.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:mysoora, comments, Political, Entertainment, Telugu
|