రాష్ట్రపతి ఎన్నికలలో ఐదుగురు తెలుగుదేశం పార్టీని ధిక్కరించారు. రాష్టపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించగా ఐదుగురు శాసనసభ్యులు ఓటు వేశారు. చిన్నం రామకోటయ్య కొడాలి నాని బాలనాగిరెడ్డి హరీశ్వర్ రెడ్డి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. వీరిలో చిన్నం రామకోటయ్య కొడాలి నాని బాల నాగిరెడ్డి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు ఓటేశారు. వీరి పైన క్రమశిక్షణా చర్యలని తెసుకోవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Telugu, desam, party, ki, 5, MLAs, jalak, Political, Entertainment, Telugu
|