నిన్న సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మృతి బాలీవుడ్ ప్రముఖులందరినీ కలిచి వేసింది. రాజేష్ ఖన్నా మృత దేహాన్ని బాలీవుడ్ టాప్ స్టార్లు అంతా సందర్శించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ విషయం తెలియగానే హుటా హుటిన అందరికంటే ముందు రాజేష్ ఖన్నా నివాసానికి చేరుకుని సంతాపం ప్రకటించారు. రాజేష్ ఖన్నాతో కలిసి అమితాబ్ నటించిన ‘ఆనంద్' సినిమాలోని ఓ దృశ్యంలోలా కాకా మృతదేహాన్ని చూడటానే అమితాబ్ బాగా ఎమోషన్‌కు గురయ్యారు. ఆయన పాదాలు పట్టుకుని కంటతడి పెట్టారు. అమితాబ్‌లో చాలా బాధ కనిపించిందని ప్రత్యక్షంగా చూసిన వారంతా అంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Big, B, kanta, tadi, Political, Entertainment, Telugu
|