అక్కినేని నాగార్జున రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్నా భక్తిరస చిత్రం “శిరిడి సాయి”. ఇప్పటికే దాదాపు ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో తెరకెక్కించవలసిన కొన్ని సన్నివేశాలను షిర్డిలో తీయనున్నారని ఇది వరకే తెలిపాము. రేపు శిరిడిలో జరగబోయే చివరి రోజు షూటింగ్ కి నాగార్జున మరియు ఈ చిత్ర టీం ఈ రోజు శిరిడి వెళ్తున్నారని తాజా సమాచారం. శ్రీ హరి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మరియు శ్రీకాంత్ శరత్ బాబు మరియు సాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిచిన ఈ చిత్ర ఆడియో ని జూలై ౩౦ న విడుదల చేయనున్నారు. ఎ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతం లో నాగార్జున రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో చిత్రాలు సూపర్ హిట్ కావడం తో ఈ చిరం మీద కూడా మంచి అంచనాలున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Shiridi, veltunna, siridi, sai, unit, Political, Entertainment, Telugu
|