ఊ కొడతారా...ఉలిక్కి పడతారా ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ బాలయ్య తన తనయుడి సిని రంగ ప్రవేశం గురించి చెప్పారు. మా అబ్బాయి మోక్షజ్ఞ కచ్చితంగా హీరో అవుతాడు. అయితే వేరే దారి లేక కాదు. తనకు సినిమాలంటే ఇంట్రస్ట్ ఉంది. అప్పట్లో నన్ను నాన్నగారు బలవంతంగా సినిమాల్లోకి నెట్టలేదు. నా ఆసక్తి గమనించి ప్రోత్సహించారు. ఇప్పుడు నేనూ అంతే అంటూ తన కుమారుడు సినీ ప్రవేశం గురించి మీడియాకు తెలియచేసారు బాలకృష్ణ. ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా'లో కీలక పాత్ర చేయడానికి గల కారణం వివరిస్తూ...ఇందులో నేను చేసినది వైవిధ్యభరితమైన పాత్ర. ఈ కథ పాత్ర నచ్చడంవల్ల చేశాను. ఈ రోల్‌ని ఎంజాయ్ చేస్తూ చేశాను. మామూలుగా నేను ఒక పాత్రను సొంతం చేసుకున్న తర్వాత అందులోకి పూర్తిగా ఒదిగిపోతాను. ఈ చిత్రంలోని పాత్రలో కూడా అలాగే మౌల్డ్ అయ్యాను అన్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mokshajna, ki, aa, intrest, vundi, Political, Entertainment, Telugu
|