ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన ఫిట్నెస్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తన పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ ని తనతో పాటు ఓవర్సీస్ షెడ్యూల్స్ కి కూడా తీసుకెళ్తున్నారు. అంతే కాకుండా అబ్రాడ్ లో పూర్తి సౌకర్యాలతో కూడిన జిమ్ ఉండే హోటళ్ళలో తనకి బస ఏర్పాటు చెయ్యాలని నిర్మాతలను కోరారు. ఇదంతా తన రాబోయే చిత్రం ‘బాద్షా’ లో సరికొత్తగా కనిపించాలని ఎన్.టి.ఆర్ తన ఫిట్నెస్ మీద ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. సరికొత్త లుక్ తో స్టైలిష్ గా మనముందుకు రాబోతున్న‘బాద్షా’ ప్రేక్షకులని ఏమేర ఆకట్టుకోనుందో చూడాలి మరి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Fitnes, baata, pattanunna, NTR, Political, Entertainment, Telugu
|