పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో మూవీ రూపొందడం ఖాయమైనది. ఈ న్యూస్ తెలిసి పవర్ స్టార్ అభిమానులు ఆల్రెడీ సంబరాలు మొదలెట్టేసారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా విజయవంతం అయ్యింది. తాజాగా మరో సినిమా తెరకెక్కనుంది. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియాకు కన్పర్మ్ చేసి చెప్పారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ...నువ్వు నాకు నచ్చావు తరహా మానవ సంభంధాలతో ఉంటుందన్నారు.అలాగే తెలుగు సంప్రదాయలుమానవ భాంధవ్యాలు ప్రధానంగా ఇందులో కనిపించేలా కథను రెడీ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Power, star, to, maatala, mantrikudu, Political, Entertainment, Telugu
|