లక్ష్మీ మంచు సౌత్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం ‘కాదల్’. ఈ చిత్రంలో గౌతమ్ (సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు) మరియు తులసి (రాధిక చిన్న కూతురు) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు . ఈ చిత్రంలో లక్ష్మీ మంచు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మణిరత్నం గారి సినిమాలో నా చివరి షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను కన్న కలలో జీవిస్తున్నాను. కలలు కనడం అసలు ఆపను అని’ లక్ష్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రం ఒక చేపలు పట్టుకొని బతికే గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడు టుటికోరియన్ జిల్లాలోని తిరుచెందూర్ అనే చిన్నపట్టణంలో జరుగుతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mani, ratnam, darsakatvam, lo, manchu, lakshmi, Political, Entertainment, Telugu
|