మెగా ఫ్యామిలీకు భాక్సాఫీస్ వద్ద తిరిగులేదని అంటున్నారు. ఈ సంవత్సరం రామ్ చరణ్ తేజ..చిత్రం రచ్చ విజయం సాధించటం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించటం ఇప్పుడు జులాయి..ఇలా వరసగా మెగాఫ్యామిలీ హీరోలు విజయాలు సాధిస్తున్నారు.మరో ప్రక్క రామ్ చరణ్ వరసగా మూడు చిత్రాలతో తెరమీదకు దూకటానికి రెడీ అవుతున్నాడు. వాటిల్లో మొదటిది రామ్ చరణ్వివివినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి నాయక్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రం కూడా రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ గా చేస్తున్నారు. మరో ప్రక్క జంజీర్ రీమేక్ చిత్రాన్ని తెలుగులో సైతం డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ వరుస హిట్ల తో టాలీవుడ్ లో మెగా నామధేయ సంవత్సరం గా మార్చిందని టాలీవుడ్ పరిశీలకులు అంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mega, family, mega, hetrik, Political, Entertainment, Telugu
|