లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీలలో భారత రెజ్లర్ సుశీల్ కుమార్ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. సుశీల్ కుమార్ కజకిస్తాన్ రెజ్లర్ అజ్‌హురేక్‌పై సెమీ ఫైనల్లో విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు. పతకం ఖాయమైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన భారత ఆటగాడిగా సుశీల్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు 66 కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ ఉజ్జెకిస్తాన్ రెజ్లర్ ఇక్తియార్ పైన క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. సుశీల్ చాకచక్యంగా పోరాట పటిమ చాటుతున్నారు. ఆయన తీరు చూస్తుంటే ఏదో ఒక పతకం ఖాయమని అందరూ అభిప్రాయానికి వచ్చారు. క్వార్టర్ ఫైనల్లో సుశీల్ ఇక్తియార్‌పై సునాయాస విజయం సాధించాడు. అంతకుముందు ఫ్రీ క్వార్టర్ ఫైనల్లో కూడా టర్కీకి చెందిన రెజ్లర్ శాహిన్ రమజాన్ పైన ఘన విజయమే సాధించాడు. సుశీల్ భారత్‌కు మరో పతకం తీసుకు రావడం ఖాయం కావడంతో భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ లండన్ ఒలింపిక్స్ లో 5 పతకాలు సాదించినప్పటికి స్వర్ణ పతకం గెలవకపోవడం తో ఇక ఆశలన్నీ సుశీల్ కుమార్ పైనే వున్నవి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:London, olympics, lo, bharath, swarnam, kala, neraveranunnadaa, Political, Entertainment, Telugu
|