నందమూరి నటసింహం బాలకృష్ణ రాజకీయాలని సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ బాలయ్య చెప్పారు. అంతేకాదు ఇప్పటికే తెలంగాణపై కేంద్రానికి ఓ లేఖ ఇచ్చామని అవసరమైతే మరోసారి లేఖ ఇస్తామని ఆయన చెప్పారు.తెలంగాణ అంశంపై మాట్లాడాల్సిన అవసరం బాలయ్యకు ఏం వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. అయితే చాలా ముందు చూపుతోనే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు. పార్టీ బాధ్యతలను తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న ఆయన కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందనేది గ్రహించినట్లున్నారు.ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయ పర్యటనలు చేయలేదు. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు దండిగానే ఉన్నారు. తెలంగాణలో కూడా ఆయన పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తన పర్యటనలకు ఆటంకాలు కలగకూడదన్నా తెలంగాణకు తాను వ్యతిరేకమనే భావన ప్రజల్లో ఉండకూడదన్నా తెలంగాణపై తన వైఖరి చెప్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఏది ఎమైనా క్లిష్ట స్థితి లో వున్నా తెలుగు దేశం పార్టీ కి ఇప్పుడు జవసత్వాలు ఇవ్వగల నాయకుడి అవసరం చాలా వుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Balayya, telangaana, paryatana, Political, Entertainment, Telugu
|