పనుల బిజీ వల్ల చిరంజీవి ఇప్పటి వరకు 'జులాయి' చిత్రాన్ని వీక్షించలేకపోయారు. తాజాగా ఎట్టకేలకు చిరంజీవి 'జులాయి' చిత్రాన్ని చూసారు. ఆయన కోసం స్పెషల్ షో వేశారు. సినిమా చూసాకా చిరంజీవి స్పందిస్తూ.....' బన్నీ నటనలో బాగా మెచ్యూర్ అయ్యాడని' కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అల్లు అర్జున్ ఇలియానా జంటగా ఈచిత్రాన్ని తివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డి.వి.వి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mama, complimentki, alludi, twitt, Political, Entertainment, Telugu
|