ప్రస్తుతం రామ్ చరణ్ హరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో ' ఇళయరాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటను రామ్ చరణ్ హరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం లో రూపొందుతున్న ‘నాయక్' చిత్రంలో రీమిక్స్ చేస్తున్నారు.ఈ సాంగు చిత్రీకరణ ఆగస్టు 22 నుంచి ఐస్ లాండ్ ద్వీపంలో జరుగనుంది. తొలత ఈ పాటను కాజల్‌తో చిత్రీకరించాలని భావించినప్పటికీ చివరకు అమపాల్‌తో చిత్రీకరించాలని నిర్ణయించాడు దర్శకుడు. సంగీత దర్శకుడు తమన్ కు ఎంతో ఇష్టమైన ఈ పాటను విపరీత సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చక్కనైన మెలోడి సాంగ్ గా కంపోజ్ చేస్తున్నారు. చిరంజీవి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేసిన రెండు చిత్రాలు 'మగధీర' 'రచ్చ' ఘన విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కుడా వర్క్ అవుట్ అయ్యి చరణ్ కు ఈ చిత్రం మరో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Muchhataga, moodosari, kooda, Political, Entertainment, Telugu
|