నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ చిత్రం ఆగష్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం యొక్క ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఆగష్టు 26న జరగనుంది. రవికుమార్ చావాలి తెరకెక్కించిన ఈ చిత్రం ఎల్లో ఫ్లవర్స్ మూవీ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. రవి కుమార్ చావాలి మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో బాలయ్య బాబు చేసిన యాక్షన్ సన్నివేశాలు మరియు ఆయన చెప్పిన డైలాగ్స్ సినిమాకి హైలైట్ అవుతాయని’ ఆయన అన్నారు. రవికుమార్ చావాలి గతంలో తీసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోని ఒక పత్రికా జరనలిస్ట్ గా చూపించారు. ఈ చిత్ర టైలర్లు ప్రేక్షకులను ఇప్పటికే అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Srimannarayan, platinum, disk, Political, Entertainment, Telugu
|