టాలీవుడ్ సుడిగాడు అల్లరి నరేష్ ఇటివల తన చిత్రాలలో స్టార్ లని అనుకరిస్తూ సూఫ్ లు చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా సినిమా పేరుని కాపి చేసేసాడు. గతం లో చిరు నటించిన మూవీ ‘యముడికి మొగుడు' టైటిల్ తో అల్లరి నరేష్ తాజా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. టైటిల్ తో పాటు దాని డిజైన్ కూడా ఉన్నదున్నట్లు కాపీ చేశారు. దానికి ‘ఈ నెలతక్కువోడు..' సబ్ టైటిల్ తగిలించారు. సినిమా స్టోరీలైన్ కూడా చిరంజీవి సినిమానే పోలి ఉంటుందని అయితే అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్‌కి సూటయ్యేలా స్ర్కీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసారు.ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని శ్రీమతి అడ్డాల ధనలక్ష్మి సమర్పణలో చంటి అడ్డాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయిక. ఈ చిత్రంలో కోసం రాజమోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 11 భారీ సెట్లు వేశారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Chiru, chitra, title, ni, soof, chesina, allari, naresh, Political, Entertainment, Telugu
|