కిరణ్ కుమార్ ప్రభుత్వం క్రమంగా వైయస్సార్ పేరును తొలగించే దిశగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని వైయస్సార్ భవన్(ఆరోగ్యశ్రీ భవన్) నుంచి ఆయన పేరును తొలగించింది. వైయస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ భవనం పేరును కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మార్పు చేసింది. వైయస్సార్ పేరుతో ఉన్న ఈ భవనం పేరును ఇప్పుడు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌గా మార్చారు. పేదలకు కార్పోరేట్ తరహా వైద్యం అందాలని వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన మృతి తర్వాత దానికి వైయస్ పేరును పెట్టారు. వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కాంగ్రెసును లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు భవన్‌లోకి వెళ్లగానే దర్శనమిచ్చే నిలువెత్తు వైయస్ బొమ్మను కూడా అక్కడ్నుంచి తొలగించారు. ఆ స్థానంలో రేపో మాపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Arogya, sree, nundi, verupadina, YS, Political, Entertainment, Telugu
|