ఒక సమయం లో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరో సుమన్.ఈ రోజు (ఆగష్టు 28) పుట్టిన రోజు సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ‘తెలుగులో ఇపటి వరకు 99 సినిమాల్లో నటించాను. త్వరలో తన నూరవ చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నట్లు సుమన్ తెలిపారు . ఇప్పటి వరకు తెలుగు తమిళ్ కన్నడం మలయాళం మరాఠీ ఇంగ్లీష్ భాషల్లో కలిపి 300 చిత్రాలకు పైగా నటించాను. నేను సినిమా పరిశ్రమలోకి 1977 వ సంవత్సరంలో వచ్చాను. దాదాపు 35 సంవత్సరాలు అయింది. ఇన్ని ఏళ్ళుగా నన్ను మోస్తున్న పరిశ్రమకు ధన్యవాదాలు’. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు కన్నడలో ఒకటి తెలుగులో మూడు మలయాళంలో ఒక సినిమా చేస్తున్నట్లు అయన తెలిపారు. ఈ చిత్రాల తరువాత సుమన్ నూరవ చిత్రం వుండబోతున్నది. అల్ ది బెస్ట్ సుమన్.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Tana, noorava, chitranni, plan, cesukuntunna, suman, Political, Entertainment, Telugu
|