సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా...బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బం గా ఇలేయానా తన పారితోషకం మరింత పెంచానున్నడనే వార్తల నేపద్యం లో విలేకరులు అడిగిన ప్రశ్నకి ఈ విడం గా సమాదనమిచ్చారు. డబ్బు కోసం కాదు సంతృప్తి కోసమే సినిమాలు చేస్తున్నాం.. అని ఎవరైనా చెబితే చెప్పొచ్చు. నాకు మాత్రం డబ్బుల విలువ తెలుసు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నా. అందుకే రెమ్యునేషన్ ఎంత? అనే లెక్కలు కూడా వేసుకొంటా'' అంటోంది ఇలియానా. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానాకి 'బర్ఫీ'తో మంచి ఫలితమే దక్కింది. అక్కడ నుంచి మరిన్ని అవకాశాలు అందుకొనే దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ మంచి రెమ్యునేషన్ డిమాండ్ చేస్తోంది అంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇలా స్పందించింది. చక్కనమ్మే ఎంతదిగినా అందమే ఆనందమే అంటూ నిర్మాతలు ముందుకొస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Andukosame, cinemaalalo, natistunna, Ileyaana, Political, Entertainment, Telugu
|