విలక్షణ నటుడు కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి చాలా సమయం పడుతుంది. దీనితో ఈ చిత్రం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బిజినెస్ కావటంలేదని అంటున్నారు అందుకే అలస్యమని బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు. కమల్ ఈ చిత్రం లో తన విశ్వరూపం ఎలా చూపనున్నదో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:2012, lo, kamal, visvaroopam, choodalemaa, Political, Entertainment, Telugu
|