కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ చర్యల అమలును వ్యతిరేకిస్తూ మూడు రోజుల గడువిచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ మంగళవారం తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా సర్కారు భాగస్వామ్య పక్షమైన ఆ పార్టీ కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వ అధికార కూటమికి దూరమైంది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రోజంతా ఉత్కంఠ రేపిన మమతాబెనర్జీ రాత్రి తీవ్ర నిర్ణయం తీసుకుని ఒక కుదుపు కుదిపారు. తృణమూల్‌కు చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాజీనామాలు సమర్పిస్తారని ఆమె పార్టీ ఎంపీలు ఉన్నతస్థాయి నేతలు కార్యవర్గ సభ్యులతో మూడు గంటల సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. ‘‘మా మంత్రులు ప్రధానమంవూతికి రాజీనామాలు సమర్పిస్తారు. యూపీఏ 2 కు మేం మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆమె ప్రకటించారు. 19 మంది లోక్‌సభ సభ్యులున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత యూపీఏలో రెండో అతి పెద్ద భాగస్వామి. ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలకు తగిన గౌరవమివ్వకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మమతాబెనర్జీ ఆరోపించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:UPA, ni, veedina, mamata, Political, Entertainment, Telugu
|