'నాయక్' సినిమా ఈ రోజు విడుదలైనది. ఇందులో చరణ్ తన వాయిస్ చాల వరకు మెరుగుపరుచుకున్నారు. 'లైలా...ఓ లైలా''హే నాయక్ ' పాటలకు చెర్రి వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ అందంతో ఈలలు కేకలతో సందడి చేశారు. అభిమానుల అంచనాలకు తగినట్టే తన పర్ఫార్మెన్స్ తో అదుర్స్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి నటించినట్లు అనిపించేలా చేశాడు. ఈ సినిమాలో కాజల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటే అమలాపాల్ పర్ఫార్మెన్స్ పరిమితమైంది. ఓ రెండు పాటలకు తప్ప ఆమె రోల్ పెద్దగా క్లిక్ కాలేదు. ఫస్టాఫ్ అంత చరణ్ బ్రహ్మిల కామెడీతో సాగిపోయింది.జిలేబి గా బ్రహ్మానందం నవ్వించాడు. తాగుబోతు సీబీఐ గా ఎమ్మెస్ నారాయణ రాహుల్ దేవ్ పెద్దన్నగా జయప్రకాశ్ రెడ్డి చేశారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే సినిమాను సాగదీసినట్లు కథ చకచకా సాగకుండా నెమ్మదిగా సాగినట్లు ఫుల్ వాయిలేన్స్ తో నింపేశారు. తమన్ మ్యూజిక్చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ నాయక్ కి ప్లస్ పాయింట్లు అయ్యాయి.
-b.s
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nayak, fast, off, keke, Political, Entertainment, Telugu
|