నాయక్ తో రామ్ చరణ్ తన ఖాతాలో మరో సూపర్ హిట్ చేర్చుకున్నాడు. తన తదుపరి సినిమా తో హట్రిక్ తన ఖాతాలో జమ చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. అయితే 'జంజీర్' సినిమా దర్శకుడు అపూర్వ లఖియా 'నాయక్ ' సినిమా చూసి ఇంప్రెస్స్ అయ్యి తన హీరోను పొగడ్తల వర్షంలో ముంచెత్తాడట. నాయక్ లో చరణ్ వేసిన డాన్సులు నచ్చి అతనిలో ఉన్న టాలెంట్ ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే 'జంజీర్' నాయక్ తో డాన్సు చేయించాలని అనుకున్నాడట. బాలీవుడ్ ప్రేక్షకులు డాన్స్ చూడటానికి ఇష్టపడతారు కానీ ఒక్క హృతిక్ తప్ప మిగితా హీరోలు డాన్సు పై కేర్ తీసుకోరు.అందుకే ఈ సినిమాకి చరణ్ డాన్సు యాడ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ అవుతుందని తన సినిమాకి ఓకే అయిన ట్యూన్ కూడా మార్చేసి డాన్స్ నెంబర్స్ పెడుతున్నాడట.ఆ విదంగా జంజీర్ తెలుగు వర్షన్ కి కమర్షియల్ వేల్యూ పెరుగుతుందని యుద్ద ప్రాతిపదికన లాంటి ట్యూన్ చేయించే పనిలో నిమగ్నమయ్యాడట.
-B.S
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:nayak, effect, janeer, pai, Political, Entertainment, Telugu
|